KTR | దొంగను దొంగలాగే చూస్తారు రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ధ్వజం
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను దొంగే అంటారు.. దొంగను దొంగలాగే చూస్తారు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
వ్యక్తిగతంగా ఎన్ని దూషణాలు, తిట్లైనా తింటాం.. అవమానాలు సహిస్తాం కానీ గత ఏడాదిన్నర కాలంగా మమ్మల్ని నోటికొచ్చిన బూతులు మాట్లాడినా చివరికి మా నాయకుడి చావును కోరుకుంటూ నికృష్టపు రోత మాటలు మాట్లాడినా మేం భరించాం. సహించాం. కోపాన్ని పంటి బిగువును దాచుకున్నాం. మమ్మల్ని ఎన్ని తిట్టినా పడుతాం కానీ.. వేల మంది త్యాగాలతో, దశాబ్దాల పోరాటల ఫలితంగా.. టీఎన్జీవోలు, బుద్దిజీవుల నేతృత్వంలో రాజకీయ నాయకులు మేల్కొక ముందే....