KTR | పెట్రోల్ ధరల పెంపు.. మండిపడ్డ కేటీఆర్
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంపుపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. నిన్న పెంచిన ధరలు అసాధారణం అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రమే గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచింది. మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు.. ధరలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరల పెంపు వలన నిత్యావసర సరుకుల ధరలు రవాణా చార్యులు భారీగా పెరుగుతాయి. సామాన్యుడి జీవితం అతలాకుతలమవుతుంది. బీజేపీ చెప్పిన అచ్చే దిన్ తీసుకురావడం ఇదేనా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ట్రంప్ తీసుకువచ్చిన నూతన టారిఫ్ విధానంపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలేదు. పార్లమె...