KTR | హెచ్‌సీయూలో జింకను చంపిన కుక్కలు.. రాహుల్ చేతికే ఆ రక్తపు మరకలు : కేటీఆర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుక్కల దాడిలో ఓ జింక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుక్కల దాడిలో ఓ జింక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆ రక్తపు మరకలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేతికే అంటాయని కేటీఆర్ పేర్కొన్నారు. అత్యాశతో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వం జింకలకు నెలవైన కంచ గచ్చిబౌలి భూములను ధ్వంసం చేసింది. దీంతో ఆ ప్రాంతంలో కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తూ జింకను చంపాయి. కంచ గచ్చిబౌలి మినీ ఫారెస్ట్‌ను రేవంత్ రెడ్డి బుద్ధిహీనంగా ధ్వంసం చేయడం వల్ల విలువైన వృక్ష, జంతుజాలం నష్టపోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు. వన్యప్రాణుల ఈ దారుణ హత్యపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్నట్లు కేటీఆర...
