KTR | ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ..! కేటీఆర్ ఆవేదన
KTR | కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నది.. సాగుకు సరిపడా నీళ్లు లేక, విద్యుత్ కోతలతో అన్నదాత బోరున విలపిస్తున్నాడు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న తల్లడిల్లిపోతున్నాడు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైపోతున్నది.. సాగుకు సరిపడా నీళ్లు లేక, విద్యుత్ కోతలతో అన్నదాత బోరున విలపిస్తున్నాడు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న తల్లడిల్లిపోతున్నాడు. ఏం చేయాలో దిక్కుతోచక కొందరు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరికొందరు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అన్నదాతల సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో నడి ఎండకాలంలోనూ చెరువులు మత్తల్లు దుంకాయని కేటీఆర్ గుర్తు చేశారు. నేడు అదే చెరువులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయని మండిపడ్డారు. నాడు కాలువల నిండా నీ...