KTR | ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేయాలి.. కేటీఆర్ డిమాండ్
KTR | ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవైపు సహాయక చర్యలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే జరిగిన ప్రమాదంపైన అందుకు బాధ్యులైన వారిపైన విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది. ఇంతకు ముందు సుంకిశాల, పెద్దవాగు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయలేదు, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప...