KTR | ఆడబిడ్డలను అక్రమ కేసులతో జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా? : కేటీఆర్
KTR | ఆడబిడ్డలను అక్రమ కేసులతో జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఆడబిడ్డలను అక్రమ కేసులతో జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టైన మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌లను చంచల్‌గూడ జైల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, డా. దాసోజు శ్రవణ్ తదితర బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలంతా అదేదో సంక్షేమ రాజ్యం అని భ్రమపడ్డారు. కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్...