BRS Dharna | జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్‌ఎస్ శ్రేణుల ధర్నా
BRS Dharna | ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన పెన్షన్ పెంపు హామీపై ప్రభుత్వాన్ని నిలదీస్తే జగదీష్ రెడ్డిని అన్యాయంగా సస్పెన్షన్ చేశారని ఆరోపించారు.
వరంగల్ వాయిస్, బాన్సువాడ : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. బీఆర్‌ఎస్ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు బాన్సువాడ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్ శ్రేణులు శనివారం ధర్నా నిర్వహించి అంబేద్కర్‌చిత్రపటానికి అందజేశారు.
ఈ సందర్భంగా జుబేర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, సీ ఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయం లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, 15 నెలల్లో ప్రజలకు ఒరుగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన పెన్షన్ పెంపు హ...