KTR : మేము అప్పుడే ప్రపోస్ చేశాం.. బీజేపీ అడ్డుకుంది
KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ జుట్టు ఢిల్లీలో ఉందని, స్ట్రాంగ్ లీడర్లను బీజేపీ, కాంగ్రెస్ ఎదగనివ్వదని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) సోమవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ (Former Minister KTR) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్‌ను గతంలోనే టీఆర్‌ఎస్ ప్రతిపాదించిందని.. 2023లో అప్పుడు బీజేపీ ఆపిందన్నారు. ఆయన గతంలో టీఆర్‌ను వీడకపోతే ఎప్పుడో ఎమ్మెల్సీ అయ్యేవారని అన్నారు. పట్టుబట్టి బీజేపీ ఆపిందని... ఇప్పుడు వారు ఆపినప్పటికీ దాసోజుకు బీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చిందని మాజీ మంత్రి అన్నారు.
రేవంత్ రెడ్డిది ఢిల్లీలో ఏమీ నడుస్తలేదన్నారు. సాక్షా...