MLC Kavitha | సుప్రీం తీర్పు వల్లే ఎస్సీ వర్గీకరణకు బాటలు.. రేవంత్, మోదీ చేసిందేమీ లేదు : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | సుప్రీంకోర్టు తీర్పు వల్లే ఎస్సీ వర్గీకరణకు బాటలు పడ్డాయని, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పు వల్లే ఎస్సీ వర్గీకరణకు బాటలు పడ్డాయని, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో దళిత బంధు సాధన సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి.. వెంటనే వర్గీకరణ చేయాలి. దళితుల మధ్య పంచాయితీ పెట్టవద్దు… ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ ఉండాలి. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారు....
