MLC Kavitha | కొడంగల్ ఎత్తిపోతల వల్ల 4.5 లక్షల ఎకరాలకు నష్టం : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | కొడంగల్ - నారాయణపేట్ ఎత్తిపోతల పథకం వల్ల పాలమూరు - రంగారెడ్డి కంపోనెంట్స్ తీసివేయడం వల్ల 4.5 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
వరంగల్ వాయిస్, నాగర్‌కర్నూల్ : కొడంగల్ – నారాయణపేట్ ఎత్తిపోతల పథకం వల్ల పాలమూరు – రంగారెడ్డి కంపోనెంట్స్ తీసివేయడం వల్ల 4.5 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు బీమా నుంచి కాకుండా జూరాల నుంచి నీటిని తీసుకుంటే మంచిదని ఇంజనీర్లు చెబుతున్నారని తెలిపారు. నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.
8 మంది ప్రాణాలు ఎస్ఎల్‌బీసీ సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే… కాంగ్రెస్ నాయకులు పార్టీ సమావేశానికి వెళ్లారు. ఒక్క మంత్రి కూడా ఘటనా స్థలం వద్ద ఇప్పుడు లేరంటే ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేదనేది అర్థమవుతుంది. కేసీఆర్ హాయాంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను 11.5 ...