MLC Kavitha | ఆయా రంగాల్లో బీసీలకు 46 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో వేర్వేరుగా 46 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
వరంగల్ వాయిస్, నాగర్‌కర్నూల్ : బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో వేర్వేరుగా 46 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అయితే ఈ మూడింటికి సంబంధించి వేర్వేరు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు కవిత. నాగర్‌కర్నూల్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు వేర్వేరు బిల్లులను పెట్టాలి. ఒకటే బిల్లు పెడితే మొదటికే మోసం వస్తుందని తొలి నుంచి నేను వాదిస్తున్నాను. ప్రభుత్వం దిగొచ్చి మూడు బిల్లులను పెట్టాలి. మూడింటికి ఒకే బిల్లు పెడితే కోర్టుల్లో నిలవదు అని ...