KTR | ఏ ఒక్క ఊరిలోనైనా 100 శాతం రుణమాఫీ జరిగితే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
ఏ ఒక్క ఊరిలోనైనా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఏ ఒక్క ఊరిలోనైనా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. శాసనసభలో రుణమాఫీ, రైతుబంధు సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. 18 గంటలు పని చేస్తున్నానని సీఎం చెబుతున్నాడు. ఒక్క రోజు సెలవు పెట్టకుండా బ్రహ్మాండంగా పని చేస్తున్నాను. 40 సార్లు కాకపోతే 400 సార్లు ఢిల్లీకి పోతా అంటున్నడు.. వెళ్లండి.. నిన్ను ఎవరు వద్దన్నరు. బ్రహ్మాండంగా తి...