KTR | హైడ్రా పేరుతో వసూళ్ల దందా.. మూసీ పేరుతో పేదల ఇండ్లపై పగ : కేటీఆర్
KTR | రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి.. కమీషన్లు ఎక్కడ వస్తాయో అక్కడ దృష్టి పెట్టిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి.. కమీషన్లు ఎక్కడ వస్తాయో అక్కడ దృష్టి పెట్టిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో వసూళ్ల దందా.. మూసీ పేరుతో పేదల ఇండ్లపై పగబట్టిందని విరుచుకుపడ్డారు కేటీఆర్.
ఫార్మాసిటీ పేరుతో భూముల చెర.. ఫోర్త్ సిటీ పేరుతో సీఎం కుటుంబ రియల్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. ట్రిపుల్ ఆర్ పేరుతో పేదల భూముల ఆక్రమించుకుంటుందన్నారు. పేదలపై ప్రతాపం చూపిస్తూ.. పెద్దలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుందన్నారు. నాడు మద్యం వద్దని చ...
