KTR | ఈ ముఖ్యమంత్రిలో అపరిచితుడు ఉన్నాడు.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడని కేటీఆర్ పేర్కొన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్కో చోట ఒక్కో మాట మాట్లాడుతూ అపరిచితుడిలా తయారైపోయాడని విమర్శించారు.
అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రస్టేషన్ పనికిరాదు. జీవితంలో అక్కడ కూర్చోవాలనుకున్నాడు.. కూర్చున్నాడు కాబట్టి కూల్ కావాలి.. ఎందుకింత ఫ్రస్టేషనో, ఎందుకింత నిస్పృహనో, ఎందుకింత ఆవేశమో మాకైతే అర్థం కావడం లేదు. ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు. మొన్న రవీంద్ర భారతిలో మాట్లాడుతూ.. మమ్మలన్ని ఎవరు నమ్ముతలేడ...