KTR | రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా..? : కేటీఆర్
KTR | బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించడం లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించడం లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు. రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ.. అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పె...