MLA Jagadish Reddy | వరంగల్ సభ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
వరంగల్ వాయిస్, యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్ వరంగల్ సభ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రజతోత్సవ సభ విజయవంతం కోసం యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి యాదాద్రి ఆలయం వరకు బీఆర్ఎస్‌వీ విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు.
ఈ పాదయాత్రను ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుంది. సబ్బండ వర్గాలు కదిలివస్తున్నాయ్. వరంగల్ సభ ఓ రేంజ్‌లో ఉంటుంది. బీఆర్ఎస్ ఏది చేసినా సంచలనమే. వరంగల్ సభ కూడా అలానే ఉంటుంది. ఇవ్వాళ అందరిలో చైత్యనాన్ని స్పూర్తిని నింపేలా బీఆర్ఎస్‌వీ విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. ఇవ్వాళ ప్రజలకు కష్టం వస్తే మా కేసీఆర్ ఉంటే బాగుండు అని అంటున్నారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ప్రతి రైతు మనసులో...