Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి మంచి కళాకారుడు అధ్యక్షా.. హరీశ్‌రావు సెటైర్లు
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి మంచి వక్త.. మంచి కళాకారుడు అధ్యక్షా.. అంటూ ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను హరీశ్‌రావు గుర్తు చేశారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి మంచి వక్త.. మంచి కళాకారుడు అధ్యక్షా.. అంటూ ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను హరీశ్‌రావు గుర్తు చేశారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగట్టారు.
ఆరు గ్యారెంటీలు ఆవిరైపోయాయి. కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందుకుంటూ ప్రజా జీవితం చక్కగ సాగుతున్న సందర్భం. స్వర్గాన్ని కిందకు దించుతామనే రీతిలో వీళ్లు హామీలు ఇచ్చిన్రు. ఆరు గ్యారెంటీల పేర...