నేడు నాందేడ్‌లో బిఆర్‌ఎస్ సభ
తెలంగాణ పథకాలపై ఫోకస్ పెట్టనున్న కెసిఆర్
వరంగల్ వాయిస్, నాందేడ్: టిఆర్‌ఎస్ పార్టీని బిఆర్‌ఎస్‌గా మార్చిన తరవాత తన తొలి అడుగును మహారాష్ట్ర నాందేడ్‌లో మోపబోతోంది. కెసిఆర్ నాయకత్వంలో జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్న క్రమంలో నాందేడ్‌లో తొలి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. తన వాణిని వినిపించబోతున్నారు. తెలంగాణలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను దేశానికి పరిచయం చేయబోతున్నారు. ప్రజలు కూడా వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో మొదటిసారి ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా చేరికలపై ప్రధాన దృష్టి సారించారు. 5న ఆదివారం నాందేడ్‌లో జరుగబోయే బీఆర్‌ఎస్ సమావేశంలో కేసీఆర్ కీలక ప్రసంగం చేయబోతున్నారు. కేసీఆర్ లాంటి నాయకుడుంటే దేశం బాగుపడుతుందని, ఆయన దూరదృష్టి ఉన్న నాయకుడని స్థానిక రైతులు కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, 24 గంటల ఉచిత వి...
