RS Praveen Kumar | రెండు గంటల్లో ఆరు సార్లు కరెంట్ కట్.. సీఎం రేవంత్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
RS Praveen Kumar | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట కరెంట్ కోతలు ఉంటూనే ఉన్నాయి. అదేదో నిమిషాల పాటు కాదు.. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట కరెంట్ కోతలు ఉంటూనే ఉన్నాయి. అదేదో నిమిషాల పాటు కాదు.. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఈ కారణంగా అటు అన్నదాతలు, ఇటు పరిశ్రమల వారితో పాటు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరెంట్ కోతలపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ రోజు హైదరాబాద్‌లో నేనుండే బండ్లగూడ ఏరియాలో రెండు గంటల్లో ఆరు (6) సార్లు కరెంటు పోయింది!! రేవంత్ గారు.. మీరు కోతలు-ఎగవేతల సీఎం కాకపోతే మరేంది? అని ప్రశ్నించారు. మీ పాలనంతా అంధకారమే అని సీఎం రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించార...