RS Praveen Kumar | రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలి.. అప్పుడే తెలంగాణ సురక్షితం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హెచ్‌సీయూ బయో డైవర్సిటీ పార్క్ విధ్వంసం, భూముల కుంభకోణంలో కాంగ్రెస్ గుంట నక్కల ముఠాపై వెంటనే సుమోటోగా కింది కేసులు పెట్టాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
హెచ్‌సీయూ బయో డైవర్సిటీ పార్క్ విధ్వంసం, భూముల కుంభకోణంలో కాంగ్రెస్ గుంట నక్కల ముఠాపై వెంటనే సుమోటోగా కింది కేసులు పెట్టాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్ 29, అటవీ సంరక్షణ చట్టం 1980లోని సెక్షన్ 2, తెలంగాణ వాల్టా చట్టం 2002లోని సెక్షన్ 35 కింద కేసులు నమోదు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, అతనికి సహ...