RS Praveen Kumar | శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
గత వారం రోజుల్లోనే నలుగురు మహిళలపై అత్యాచార ఘటనలు జరిగాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. మేడ్చల్ ఎంఎంటీఎస్ మహిళా బోగిలో ఉన్నప్పటికీ మహిళపై అత్యాచారం జరిగింది. సంగారెడ్డి కందిలో భర్తను కట్టేసి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ గుడి దగ్గర మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. మార్చి 31న జర్మనీ మహిళపై పహాడీ షరీఫ్‌లో అత్యాచారం జరిగింద...