Jagadish Reddy | కార్మికుల ప్రాణాల కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ఫైర్
Jagadish Reddy | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్‌లోనే చిక్కుకుని ఉన్నారని తెలిపారు. వారి ప్రాణాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు.
Jagadish Reddy | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్‌లోనే చిక్కుకుని ఉన్నారని తెలిపారు. వారి ప్రాణాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం నాడు జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టన్నెల్‌లో చిక్కుకున్న వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే అయినప్పటికీ.. తెలంగాణ పునర్నిర్మాణంలో బయట రాష్ట్రాల కార్మికుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలో దాదాపు 35 లక్షల మంది బయటి రాష్ట్రాల కార్...