Warangalvoice

Tag: Brindavan colonists blocking granite lorries

గ్రానైట్ లారీలను అడ్డుకున్న బృందావన్ కాలనీవాసులు
Top Stories

గ్రానైట్ లారీలను అడ్డుకున్న బృందావన్ కాలనీవాసులు

వరంగల్ వాయిస్, కాజీపేట : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాజీపేట పట్టణం, 63వ డివిజన్ బాపూజీ నగర్ కూరగాయల మార్కెట్ పరిధిలో నూతనంగా ఏర్పడిన బృందావన్ కాలనీవాసులు బుధవారం గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఈ గ్రానైట్ క్వారీలను నడుపుతున్న నాలుగు క్వారీ యజమానుల మీద ప్రస్తుత కాజీపేట సీఐకి ఫిర్యాదు చేశామన్నారు. గ్రానైట్ క్వారీ ఓనర్లు ఇష్టారాజ్యంగా గ్రానైట్ లోడ్ తో లారీలను కాలనీలో నడిపిస్తున్నారని, గతంలో కాజీపేట సీఐగా పనిచేసిన మహేందర్ రెడ్డి, రాజులకు పిటిషన్లు ఇవ్వగా, నాలుగు క్వారీల యజమానులు వచ్చి కాలనీవాసులను సమయం అడగగా కాలనీవాసులు ఒప్పుకోలేదన్నారు. అలాగే గతంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు తెలియపరచగా ఆయన కాలనీకి వచ్చి అప్పటి స్థానిక సీఐ, ఏసీపీ, తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ మైనింగ్ ఏడీలను పిలిపించి...