Warangalvoice

Tag: Bomb Threat To Warangal Court On Friday

Warangal Court | వ‌రంగ‌ల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
District News

Warangal Court | వ‌రంగ‌ల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

వ‌రంగ‌ల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. దీంతో పోలీసులు, లాయ‌ర్లు, కోర్టు సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వరంగల్ వాయిస్, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. దీంతో పోలీసులు, లాయ‌ర్లు, కోర్టు సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. కోర్టు వ‌ద్ద‌కు చేరుకున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. లాయ‌ర్లు, కోర్టు సిబ్బంది భ‌యంతో గ‌డుపుతున్నారు. జిల్లా జ‌డ్జికి మెయిల్ ద్వారా ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి నుంచి బాంబు పెట్టామ‌ని మెయిల్ చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నే విష‌యాన్ని తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు. నిన్న మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, నాగ‌ర్‌క‌ర్నూల్ క‌లెక్ట‌రేట్ల‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే....