కర్నాటకలో బిజెపి పప్పులు ఉడకకపోవచ్చు
కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం
డబుల్ ఇంజిన్‌కు ఈ సారి ట్రబుల్ తప్పదంటున్న సర్వేలు
వరంగల్ వాయిస్,బెంగళూరు: కర్నాటకలో త్వరలో జరగబోయే ఎన్నికలు బిజెపికి అంత సులువు కాదని స్థానిక పరిస్థితులు తెలియ చేస్తున్నాయి. బిజెపి నేతలు అవినీతితో కూరుకు పోవడం ఇప్పుడు అక్కడ చర్చగా మారింది. మిగతా రాష్టాల్రతో పోలిస్తే కర్నాకటలో డబుల్ ఇంజిన్ సర్కార్‌తో లాభం లేదన్న విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. 2008 ఎన్నికల్లోనూ, 2019లోనూ కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాలేదు. ఆపరేషన్ ఆకర్శక్‌తో గట్టెక్కి అంటే బలవంతంగానే అధికారాన్ని లాక్కున్నారని చెప్పక తప్పదు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. కాంగ్రెస్‌కు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయి.
ఈ క్రమంలో మే 10న జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి పెద్ద పరీక్ష. దక్షిణ భారతంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక మాత్రమే. నిజానికి కర్నాటకలో ...