Warangalvoice

Tag: bjp union minister bandi sanjay clarifies not contesting president race

ఆ రేసులో నేను లేను.. తేల్చిచెప్పేసిన బండి సంజయ్
Top Stories

ఆ రేసులో నేను లేను.. తేల్చిచెప్పేసిన బండి సంజయ్

Bandi Sanjay Clarifies: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై కేంద్రమంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేశారు కేంద్రమంత్రి. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి  ఎంపిక త్వరలోనే జరుగనుంది. ఈ పదవి కోసం పార్టీలోని ఆశావాహులు ఎదురుచూస్తున్న పరిస్థితి. ఆ పదవి తమకే రావాలని పలువురు సీనియర్ నేతలు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా... తెలంగాణ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌  అంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడి పదవిపై వస్తున్న వార్తలకు కేంద్రమంత్రి పుల్‌స్టాప్ పెట్టేశారు. ‘నేను రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను, నాకే రావాలని కోరుకోవడం లేదు’ అని తేల్చి చెప్పేశారు. అలాగే సోషల్ మీడియా, మీడియాలో వచ్చే పేర్లపై, ప్రచారం చేసుకునే నేతలపై అధిష్టానం సీరియస్‌గా ఉందని కేంద్రమంత్రి వెల్లడించారు...