Raghunandan Rao: కేసీఆర్‌తో భేటీలో ఆ విషయం మాట్లాడు.. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్
Raghunandan Rao: కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న చూపు చూశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏనాడైనా బీసీల సంక్షేమానికి కృషి చేసిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు కవిత బీసీల గురించి మాట్లాడుతేంటే విడ్డూరంగా ఉందని రఘునందన్ రావు విమర్శలు చేశారు.
వరంగల్ వాయిస్, సిద్దిపేట: బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేశారు. గజ్వేల్ పట్టణంలో ఇవాళ(శుక్రవారం) మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. కవితకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్‌తో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ పదవి బీసీకి ఇప్పించాలని సవాల్ విసిరారు. శాసనసభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడిని బీసీ నేతకు ఇవ్వండి. శాసన మండలిలో కూడా మరో బీసీ నేతకు ఇవ్వాలని ఛా...