కల్యాణ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి
కల్యాణ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి
వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వరంగల్ జిల్లా ప్రజలకు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ఆలయాలలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవాల్లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం వేలాది మంది భక్తులు రాములవారి కళ్యాణానికి చూడటానికి పోటెత్తారని, అయోధ్యలోని రామాలయంలో 500 సంవత్సరాల తరువాత ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయనన్నారు. రాముడు ధర్మ స్వరూపుడు.. సత్యనిష్ఠకూ ధర్మనిరతికీ ప్రతీక అన్నారు. శ్రీరామ జయం.. సకల ప్రజల విజయం..అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి, ప్రజలను మరింత బలసంపన్నులను చేయాలని శ్రీ రామచంద్ర ప్రభువును వేడుక...