పట్టభద్రుల ఓటును అడిగే అర్హత బీజేపీ, బీఆర్ఎస్ లకు లేదు
వరంగల్ వాయిస్, తొర్రూరు : మండలంలోని వెలికట్టే గ్రామంలో గల స్థానిక రామ ఉపేందర్ ఫంక్షన్ హాల్ లో గురువారం వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల సన్నాహాక సమావేశం పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి సభాధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కావాలంటే తీన్మార్ మల్లన్నను గెలిపించవలసిన అవసరం పట్టభద్రులకు ఉందన్నారు. గతంలో పట్టభద్రులు పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యల గురించి ఏనాడు కూడా రాష్ట్ర శాసనమండలిలో మాట్లాడకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులను పూర్తిగా విస్మరించా...