రంగసాయిపేటలో బీరన్న బోనాలు
వరంగల్ వాయిస్, రంగసాయిపేట : ఈరోజు రంగసాయిపేటలో ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ బిరన్న దేవస్థానంలో బోనాల జాతర జరిగినది. ఆలయానికి ప్రధాన పూజారి మండల నర్సింహా రాములు, కుటుంబ సభ్యులతో ఆలయానికి పూజా సామాన్ల గంప నెత్తిపై ధరించి ఆలయానికి కురుమ కళాకారులు డప్పు చప్పులతో కళాకారులు ఆలయానికి విన్యాసాలు చేస్తూ ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం ఆలయ పూజారి స్వామివారి లింగాలను పాలాభిషేకం పసుపు బండారి తో అలంకరించారు స్వామివారి కంకణాలు పసుపు బండారి మరియు గొర్రె పాలతో కంకణాలకు అభిషేకం చేశారు. స్వామివారి గద్దె మీద పెట్టి నైవేద్యం పళ్ళు పెట్టి స్వామివారికి చూపించారు. పూలతో అలంకరణ అఖండ దీపం వెలిగించి టెంకాయ కొట్టి గుమ్మడికాయ తో ఆలయానికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి మంగళ హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు కంకణాలు భక్తులకు ఆలయ పూజారి ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక వైద్య నిపుణులు డాక్టర్ కె చంద్రశేఖర్, ఆర్య డాక్టర్...
