శ్రీరాముడి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలి..
వరంగల్ వాయిస్, స్టేషన్ ఘనపూర్ : మండలం తాటికొండ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చిల్పూరు మండలం నష్కల్ లో శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీరామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలోని శ్రీ సీత రామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడికి విచ్చేసిన భక్తులు, చిన్నారులతో మమేకమై వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య వారిని ఆప్యాయంగా పలకరించారు.
కనకదుర్గ మాత దేవాలయంలో..
వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : సీతారాముల కళ్యాణం సందర్భంగా నర్సంప...