Surya Tilak | ఏప్రిల్ 6న అయ్యోధ రామయ్యకు సూర్య తిలకం..!
శ్రీరామ నవమి వేడులకు అయోధ్య సిద్ధమవుతున్నది. నవమి వేడుకల సంబంధించిన షెడ్యూల్‌ను రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాల రామయ్య ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య తిలకం దిద్దనున్నారు.
శ్రీరామ నవమి వేడులకు అయోధ్య సిద్ధమవుతున్నది. నవమి వేడుకల సంబంధించిన షెడ్యూల్‌ను రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాల రామయ్య ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య తిలకం దిద్దనున్నారు. సూర్య కిరణాలు దాదాపు నాలుగు నిమిషాల పాటు బాల రామయ్య నుదుటిపై పడనున్నాయి. ఈ వేడుకను తిలకించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేసింది. నవమి వేడుకల రోజున ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు అభిషేకం, ఉదయం 10.40 గంటల నుంచి 11.45గంటల మధ్య ఆరాధన కార్యక్రమాల జరుగనున...
