Warangalvoice

Tag: At Sri Bhavani Kumkumeshwara Temple in Parakala..

హనుమకొండ పద్మాక్షి కాలనీలో.. సీతారామ కల్యాణ మహోత్సవం
Cultural, District News

హనుమకొండ పద్మాక్షి కాలనీలో.. సీతారామ కల్యాణ మహోత్సవం

హనుమకొండ పద్మాక్షి కాలనీలో.. వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ పద్మాక్షి కాలనీలోని శ్రీ ప్రసన్నాంజనేయ దేవాలయంలో బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ మారుతీ పరపతి సంఘం ఆధ్వర్యంలో సీతారామ కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గంధతి సుధాకర్-కల్పన, అడపా కిరణ్-స్వాతి, గందే సాయిరాం-మాధురిలు కల్యాణంలో పాల్గొన్నారు ఆలయ కమిటీ గందె కృష్ణ-భాగ్యలక్ష్మి, కనుకుంట్ల రవికుమార్-ఉమాదేవి, కరు దశరథ్ కుమార్-లలిత, మాదాసు మొగులయ్య-సరళ, అంబటి నరేందర్-అరుణ, గంట సత్యం-సీత, మారుతి పరపతి సంఘ కమిటీ మేఘా సింగ్, కాటి ఎల్లయ్య, దేవులపల్లి సంపత్, నట్వర్లాల్ పటేల్, హర్షం కృష్ణమూర్తి, ఆరుట్ల రామాచార్యులు, ఆలయ అర్చకులు, హనుమాన్ మూలాధారణ స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించినారు. భక్తులు తలంబ్రాలు వేసి తదనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు. 29వ డివిజన్ లో.. వరంగల్ వాయిస్, ...
పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వరాలయంలో..
Cultural, District News

పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వరాలయంలో..

పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వరాలయంలో.. వరంగల్ వాయిస్, పరకాల : శ్రీరామ నవమి సందర్భంగా పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ మహోత్సవంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని, సుఖ సంతోషాలతో అందరూ జీవించాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బసవేశ్వరాలయంలో.. శ్రీరామనవమి సందర్భంగా గీసుగొండలోని బసవేశ్వరాలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ...