రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ అధ్యక్షుడిగా అశోక్‌బాబు
నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
వరంగల్ వాయిస్, ఖిలా వరంగల్ : రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సం సోమవారం కాశిబుగ్గలోని వేడుకల మందిరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ శరత్ బాబు నూతన కమిటీచే ప్రమాణస్వీకారం చేయించారు. క్లబ్ ప్రెసిడెంట్‌గా బేతి అశోక్ బాబు, సెక్రటరీగా భేతి సతీష్, కోశాధికారిగా ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బేతి అశోక్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంలో రోటరీ క్లబ్ ముందంజలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పేదలకు ఐదు కుట్టుమిషన్లు, స్కూలుకు పోయే పిల్లలకు ఐదు సైకిళ్లు ఉచితంగా అందజేశారు. కాశిబుగ్గ ఎస్సార్ నగర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ప్యాడ్స్, బుక్స్, బ్యాగ్స్, షూస్, చైర్స్ అందించారు. బేతి అశోక్ ఆధ్వర్యంలో 25 మంది ...