BRS leader Rajaramesh | ప్రజలకు న్యాయం చేయాలని పోరాడితే అక్రమ కేసులా ? : బీఆర్ఎస్ నాయకుడు రాజారమేశ్
తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని చెన్నూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేశ్ ధ్వజమెత్తారు.
వరంగల్ వాయిస్, చెన్నూర్ టౌన్ : తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని చెన్నూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేశ్ ధ్వజమెత్తారు. పార్టీ నాయకులతో కలిసి మంగళ వారం ఆయన చెన్నూర్ కోర్టులో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 420 హామీలు, ఆరు గ్యారెంటీలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని, మరీ ముఖ్యంగా రైతన్నలను దారుణంగా మోసం చేసిందని ధర్నా చేసినందుకు బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన 17 మంది నాయకులపై అక్రమ కేసులు పెట్టి కోర్టుకు లాగిందని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక...