అర్ధరాత్రి అరుణోదయం
అరవయ్యేండ్ల సంగ్రామం తరువాత భారత జాతి విముక్తిని సాధించింది. 15 ఆగస్టు 1947 భారత జాతికి వెలుగుల దినం, ఉత్సవ దినం, పర్వదినం, పరువాల దినం. భారత జాతికి రెండు శతాబ్దాల అంగ్రేజుల దాస్యం నుంచి విముక్తి గలిగింది. ఇది స్థూల దృష్టి. భారతజాతి ఎన్నో శతాబ్దాలుగా ‘స్వరాజ్యం’ కోల్పోయింది. సురాజ్యమూ నష్టపోయింది. మనం స్వరాజ్యం సాధించుకున్నం. ఇక మనను పైవాడు పాలించాడు. మనమే పాలించుకుంటాం. ఇది మన దేశం. దీనిని మనమే చక్కబరచుకుంటాం. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి బ్రిటిష్ పతాకం ‘యూనియన్ జాక్’ దిగిపోయింది. భారత జాతీయ పతాకం త్రివర్ణ కేతనం సగర్వంగా ఎగిరింది. అప్పుడు నెహ్రూ అన్నారు ‘లోకం నిద్రిస్తున్నపుడు భారతదేశం మేల్కొన్నది’ అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ సామ్రాజ్యవాదులు సాధారణంగా అధికారం వదులుకోరు. అసలు అధికారమే అలాంటిది. దాన్ని ఎవడూ వదలడు. స్వచ్ఛందంగా అధికారం వదలుకున్నవారు చరిత్రలో అరుదు. అర్ధం, అధికారం ఈ రెంటినీ వదిలిం...