Warangalvoice

Tag: Anything is possible with persistence

ప‌ట్టుద‌ల‌తోనే ఏదైనా సాధ్యం
District News, Jangaon

ప‌ట్టుద‌ల‌తోనే ఏదైనా సాధ్యం

అబ్దుల్ క‌లామే అందుకు నిద‌ర్శ‌నంమంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుపాల‌కుర్తి జడ్పీ పాఠ‌శాల‌లో అబ్దుల్ క‌లామ్ విగ్రహావిష్క‌ర‌ణ వరంగల్ వాయిస్, పాలకుర్తి: పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని, అందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ క‌లామ్ జీవితమే నిదర్శమని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కొనియాడారు. బుధవారం జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో ఏపీజే అబ్దుల్ క‌లామ్ విగ్ర‌హాన్ని ఆయన ఆవిష్క‌రించారు. పదో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో అత్యంత ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర‌చిన విద్యార్థుల‌కు స‌న్మానం చేశారు. ఉత్త‌మ సేవ‌లు అందించిన స్కూల్ అటెండ‌ర్ భిక్ష‌ప‌తిని మంత్రి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీవిత‌మంతా శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, సమాజం కోసం పాటుపడిన మహనీయుడు డా. ఏపీజే అబ్దుల్ కలాం అని, నీతికి, నిజాయితీకి నిలువె...