SLBC Tunnel | ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం వెలికితీత.. ఇంజినీర్ మనోజ్‌కుమార్‌గా గుర్తింపు
దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నందు 33వ రోజు మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ లభ్యమైనది. టన్నెల్ నందు సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి టిబిఎం మిషన్ కింద కన్వేయర్ బెల్టు డ్రమ్‌కు 40 మీటర్ల దూరంలో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి.
వరంగల్ వాయిస్, అచ్చంపేట : దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నందు 33వ రోజు మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ లభ్యమైనది. టన్నెల్ నందు సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి టిబిఎం మిషన్ కింద కన్వేయర్ బెల్టు డ్రమ్‌కు 40 మీటర్ల దూరంలో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. టన్నెల్ నందు మినీ జెసిపి ద్వారా శిథిలాలు తొలగించడం, మట్టి బురదను బయటకు పంపడం సహాయక చర్యలు కొనసాగుతుండగా శిథిలాల కింద మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. అట్టి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉండడం, ఆ ప్రదేశం భరించలేని దుర్వాసన వస్తుండడంతో మిగిలిన ఆరుగురి మృతదేహాలు కూడా అదే ప్రదేశంలో ఉండే అవకాశం ఉంటుందని అనుమానిస్త...
