Warangalvoice

Tag: Anganvadis are Developed in own state

స్వరాష్ట్రంలో బాగుపడ్డ అంగన్వాడీల జీవితాలు
District News, Jangaon, Top Stories

స్వరాష్ట్రంలో బాగుపడ్డ అంగన్వాడీల జీవితాలు

వరంగల్‌ వాయిస్‌, జనగాం : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ మరియు హెల్పర్స్‌ యూనియన్‌ టీఎన్‌ జీవో (తెలంగాణ నాన్‌ గెజిటడ్‌ ఆఫీసర్స్‌) అనుబంధం జనగాం జిల్లా అధ్యక్షురాలు కాసగోని స్వరూపరాణి, కార్యదర్శి గుమ్మడవెల్లి రమాదేవి ఆధ్వర్యంలో స్టేషన్‌ ఘనపూర్‌ ప్రాజెక్ట్‌, రఘునాథపల్లి మండల కేంద్రంలోని కోమళ్ళలో అంగన్వాడీ టీచర్స్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .ఈ సందర్భంగా అధ్యక్షురాలు స్వరూపారాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీల జీవితాలు బాగున్నాయన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతను వివరించారు. రఘునాథపల్లి మండలం అధ్యక్షురాలు గొట్టం మంజుల, కార్యదర్శి ఎండీ ఫాతిమా, కోశాధికారి ఐలమ్మ, కోమళ్ల సర్కిల్‌ అధ్యక్షురాలు ఇల్లందుల రాజమణి, కార్యదర్శి నల్ల నర్సమ్మ, కోశాధికారి తమ్మడపల్లి శారద, కార్యవర్గ సభ్యుల బొల్లాపల్లి ప్రేమలత, చేపురి మమత, కింద విజయ, మార...