భారత రాజకీయాల్లో అనూహ్య పరిణామం
కాంగ్రెస్ ఎంపి రాహుల్‌పై అనర్హత వేటు
లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసిన
తక్షణమే లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన రాహుల్
వయొనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: భారతీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే భారత్ జోడోయాత్రతో ప్రజల ముందుకు వచ్చిన రాహుల్ లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిరది. ఎంపీగా రాహుల్ గాంధీ చెల్లుబాటు కారని లోక్‌సభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యుడిగా అనర్హత పొందారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై.. లోక్‌సభ సెక్రటేరియేట్ అనర్హత వేటు విధించింది. లోక్‌సభ నుంచి ఆయన్ను డి...