అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పూర్తిచేయాలి
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
వరంగల్ వాయిస్, రేగొండ : జూన్ 10లోపు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను పూర్తి చేయాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శనివారం మండలంలోని బాగిర్తిపేట, గూడెప్పల్లి, మడత పల్లి, రంగయ్యపల్లి, గోరి కొత్తపల్లి మండలంలోని రూపిరెడ్డిపల్లి, చిన్న కోడెపాక గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాధమిక, ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకునేందుకు అనువుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పనకు మరమ్మత్తు పనులు చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఒక్క పని పెండింగ్ లేకుండా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మండలంలో 26 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు రూ. కోటి 17 లక్షలతో పనులు చేపట్టినట్లు ఆయ...