భూ అక్రమణల ఆరోపణలు సత్యదూరం
రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
మంత్రి సిదిరి అప్పలరాజు సవాల్
వరంగల్ వాయిస్,శ్రీకాకుళం: తనపై వస్తున్న భూ అక్రమణలపై మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటుగా స్పందించారు. తాను గానీ, తన అనుచరులు గాని ఎక్కడైనా ఇంచ్ భూమి ఆక్రమించామని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తన టీం తప్పు చేసినా తాను తప్పు చేసినట్టే అని అన్నారు. పలాస నియోజకవర్గ పరిధిలో భూ ఆక్రమణలపై మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి స్పందన కార్యక్రమం నిర్వహించారు. టిడిపి నాయకులు 600 కోట్ల రూపాయల విలువ గల భూములు కబ్జా అయ్యాయని విూడియా ముందు పదేపదే చెబుతున్నారు. ఆక్రమణ జరిగితే స్పందన కార్యక్రమంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. తన అనుచరులపై ఎవరైన ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజకీయాలకు దూరంగా ఉండే తన భార్యపై కూడా ఆరోపణలు చేస్తూ రాతలు రాస్తున్నారని ఆవే...