TG Cabinet | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్.. కేబినెట్‌లో కొత్తగా నలుగురికే ఛాన్స్..?
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కేవలం నాలుగైదు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కేవలం నాలుగైదు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది. కేబినెట్ విస్తరణపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు సేకరించింది. కొత్త మంత్రులు ఏప్రిల్ 3న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మంత్రివర్గంలో కొత్తగా ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. బీసీల్లో శ్రీహరి ముదిరాజ్, ఆది శ...