కన్నడనాట బిజెపి ఎదురీత
అధికార పార్టీలో లంచావతారాల తంటా
మరోమారు అధికారం కోసం జెడిఎస్ యత్నాలు
వరంగల్ వాయిస్,బెంగళూరు: కర్ణాటకలో మరో నెలన్నరలోగా ఎన్నికలు జరగనుండడంతో.. రాజకీయ సవిూకరణలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీఇప్పటికే 224 స్థానాలకు గాను.. 124 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ.. ఆచితూచి అడుగులు వేస్తోంది. కన్నడనాట బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్ బలమైన మైత్రి కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్, జెడిఎస్ కలవకుండా బిజెపి లోపాయకారి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు మాజీమంత్రి, మాజీ బిజెపి నేత గాలి జనార్ధన్ రెడ్డి కూడా ప్రాంతీయ పార్టీ పెట్టి రంగంలోకి దిగారు. తమ గుర్తును ఆయన ఫుట్‌బాల్‌గా ఎంచుకున్నారు. నిజానికి కర్నాటకలో బిజెపి నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఏర్పడ్డా..అధికారం దక్కలేదు. కుమారస్వామి ...
