అధికారంలోకి రాగానే.. కేసీఆర్ చర్లపల్లి జైలుకే
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
వరంగల్ వాయిస్, హనుమకొండ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ గా చర్లపల్లి జైలుకే పంపిస్తామని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న సమావేశం దేశ, రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారనుందన్నారు. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పురించబోతున్నామని ఆయన ప్రకటించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నట్టేటా ముంచుతున్నారన్నారని మండిపడ్డారు. ప్రజలకోసం, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్యం కోసం రాజాకీయాలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రె...