ఇప్పటినుంచే అడ్మిషన్లు..ఫీజుల గోల
కార్పోరేట్ స్కూళ్ల దోపిడీకి రంగం సిద్దం
ముందే వసూళ్లకు ముందస్తు పరీక్షలు
వరంగల్ వాయిస్,హైదరాబాద్: త్వరలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. పిల్లలు పరీక్షల కోసం కుస్తీ పడుతున్నారు. పరీక్షల కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వచ్చే ఏడాదికి సంబంధించి అడ్మిషన్ల గోల మొదలయ్యింది. ప్రైవేట్ స్కూళ్లు యదావిధిగా వసూళ్లకు తెగబడు తున్నాయి. తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేసే పనిలో పడ్డాయి. ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించి మార్చిలో కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభించేందుకు పలు పాఠశాలలు రంగం సిద్దం చేశాయి. ఈ క్రమంలో వీరి దృష్టి అంతా వసూళ్లపై నే ఉంది. విద్యార్థులు, టీచర్లపై వారికి దృష్టి ఉండడం లేదు. టీచర్లకు సకాలంలో జీతాలు ఇవ్వాలన్న లక్ష్యం పక్కకు పోయింది. ఫీజలును పెంచేసి డబ్బులు లాగేయాలన్న లక్ష్యంతో కార్పోరేట్ స్కూళ్లు తల్లిదండ్రులను వేధించక తప్పడం లేదు. ప్రైవేట్ విద్యాసంస్...
