Warangalvoice

Tag: Actions for development in villages

గ్రామాల్లో అభివృద్దికి చర్యలు
Political, Telangana

గ్రామాల్లో అభివృద్దికి చర్యలు

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి వరంగల్ వాయిస్,పెద్దపల్లి: రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. రైతు సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ రాష్టాన్రికే దక్కిందని పేర్కొన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడంతోపాటు గోదాంల నిర్మాణం,తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. గ్రామాల్లో ఎటు చూసినా పచ్చదనంతో ఉండేలా చెట్లను పెంచుకోవాలనీ, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మనోహర్‌రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాలాభివృద్ధి కోసం ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ను కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టారని తెలిపార...