Warangalvoice

Tag: Accused sentenced to death in boy’s murder case

బాలుడి హత్య కేసులో.. నిందితుడికి మరణ శిక్ష
Crime, District News, Mahabubabad, Viral News

బాలుడి హత్య కేసులో.. నిందితుడికి మరణ శిక్ష

మహబూబాబాద్ కోర్టు సంచలన తీర్పు మూడేళ్ల క్రితం ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ లో మూడేళ్ల క్రితం తొమ్మిది సంవత్సరాల బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు మంద సాగర్ కు మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం జిల్లా కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు న్యాయ దేవత, పోలీసుల చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళితే..మహబూబాబాద్ పట్టణంలోని కృష్ణ కాలనీలో నివాసముంటున్న జర్నలిస్ట్ కుసుమ రంజిత్ రెడ్డి-వసంత దంపతులు కుమారుడైన దీక్షిత్ రెడ్డి 18 అక్టోబర్ 2020 సాయంత్రం 5 గంటల సమయంలో కాలనీ పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. శనిగపురం గ్రామానికి చెందిన మంద సాగర్ స్థానికంగా ఉంటూ ఆటో మొబైల్ షాప్ నడుపుకుంటున్నాడు. ఆర్థికంగా ఉన్న దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని కుట్ర పన్నిన మంద సాగర్ ఆయ...