పాదయాత్రల జోరు
సెంటిమెంటుగా భావిస్తున్న నేతలు
ఎన్టీఆర్‌తో శ్రీకారం.. వైఎస్ తో వైభవం
రాష్ట్రంలో కొనసాగుతున్న వైఎస్ శర్మిల, ప్రవీణ్ కుమార్ పాదయాత్ర
అత్యధిక రోజులు పాదయాత్ర చేసిన జగన్
నేడు యాదాద్రిలో మూడో విడత ప్రారంభించిన బండి సంజయ్
రాష్ట్రంలో పాదయాత్రల జోరు కొనసాగుతోంది. అధికారమే లక్ష్యంగా పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. పాదయాత్రలు చేయడం ద్వారా పవర్‌లోకి రావచ్చని భావిస్తున్నారు. గతంలో ఇది వర్కవుట్ కావడంతో నేటి నేతలు సెంటిమెంటుగా భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఎన్టీరామారావు పాదయాత్ర చేపట్టడంద్వారా ప్రజలకు మరింత చేరువై అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే ఒరవడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగించి ముఖ్యమంత్రి అయ్యా...
