ప్రై‘వేటు’కు సిద్ధంగా వైటీపీఎస్!
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్లాంట్ ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ (ఓఅండ్‌ఎం)ను సదరు సంస్థకు అప్పగించేందుకు భారీ కుట్ర చేశారా? అంటే.. టీజీ జెన్‌కో ఇంజినీర్లు అవుననే అంటున్నారు.
ప్లాంట్ నిర్వహణ లోపం వెనక కుట్ర
ఉద్దేశపూర్వకంగానే ఓఅండ్‌ఎం స్టాఫ్ ఇంజినీర్లను కేటాయించని జెన్‌కో
ఆరు నెలలుగా వేధిస్తున్న సిబ్బంది కొరత
సీఈ లేఖ రాసినా స్పందన శూన్యం
ప్లాంట్‌ను ప్రైవేటుకు అప్పగించే ప్లాన్
జెన్‌కో ఇంజినీర్ల అనుమానం
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్లాంట్ ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ (ఓఅండ్‌ఎం)ను సదరు సంస్థకు అప్పగించేందుకు భారీ కుట్ర చేశారా? అంటే.. టీజీ జెన్‌కో ఇంజినీర్లు అవుననే అంటున్నారు. కుట్రలో భ...